సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్) పరీక్షల్లో భాగంగా శనివారం ఇంటర్ ఎకనామిక్స్, బయాలజీ పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్) పరీక్షల్లో భాగంగా శనివారం ఇంటర్ ఎకనామిక్స్, బయాలజీ పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఏడుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు. నగరంలోని వివిధ కేంద్రాలను ఆర్‌ఐఓ వెంకటేశులు, డీఈఓ లక్ష్మీనారాయణ విడివిడిగా తనిఖీలు చేశారు.
చిట్టీలు దొరకడంతో నేతాజీ స్కూల్ కేంద్రంలో ముగ్గురు, ఎల్‌ఆర్‌జీ స్కూల్ కేంద్రంలో నలుగురు, సెయింట్ డీపాల్ స్కూల్ కేంద్రంలో ఒకరిని స్వయంగా డీఈఓనే డిబార్ చేశారు. ఇన్విజిలేటర్లకు సంబంధించి నేతాజీ పాఠశాల కేంద్రంలో ఒకరు, ఎల్‌ఆర్‌జీ స్కూల్ కేంద్రంలో ఇద్దరు, సెయింట్ డీపాల్ స్కూల్ కేంద్రంలో ఇద్దరు, కదిరి పట్టణంలోని కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు. మొత్తం 5,331 మంది విద్యార్థులకుగాను 4,794 మంది పరీక్షలకు హాజరయ్యారు. 529 మంది గైర్హాజరయ్యారు.