లోక్‌ అదాలత్‌లో 729 కేసుల పరిష్కారం | 729 cases were solved in lok adalath | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 729 కేసుల పరిష్కారం

Oct 8 2016 11:39 PM | Updated on Sep 4 2017 4:40 PM

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 729 కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని రెండో అదనపు జిల్లా జడ్జి కె.సాయి రమాదేవి నిర్వహించారు.

ఏలూరు (సెంట్రల్‌) : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 729 కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని రెండో అదనపు జిల్లా జడ్జి కె.సాయి రమాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ ఇచ్చిన తీర్పు సివిల్‌కోర్టుతో సమానంగా పరిగణించబడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారిత సంస్థ కార్యదర్శి ఎ.నరసింహమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్‌ వై.సాయిశ్రీకాంత్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement