గుత్తి పట్టణంతోపాటు, ఆర్‌ఎస్‌లో బుధవారం చైల్డ్‌లైన్–1098, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హోటళ్లు, దుకాణాలు, జనరల్ స్టోర్స్, డాబాలు, మెకానిక్ షాపులలో పనిచేస్తున్న 25 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.
గుత్తి : గుత్తి పట్టణంతోపాటు, ఆర్‌ఎస్‌లో బుధవారం చైల్డ్‌లైన్–1098, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హోటళ్లు, దుకాణాలు, జనరల్ స్టోర్స్, డాబాలు, మెకానిక్ షాపులలో పనిచేస్తున్న 25 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. మరో ఐదుగురు భిక్షమెత్తుకునే బాలలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇప్పించారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. చైల్డ్‌లైన్ 1098 కో–ఆర్డినేటర్ బాలాజీ, ఎస్‌ఐ చాంద్‌బాషా మాట్లాడుతూ బాలలు పనుల్లో కాదు బడుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే దాడులు నిర్వహిస్తున్నామన్నారు. చైల్డ్‌లైన్ 1098 సిబ్బంది రామకృష్ణ, పోలీసులు పాల్గొన్నారు.