
19 గొర్రెలు మృత్యువాత
శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి.
శింగనమల : శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి. అందులో 13 గొర్రెలు నాముకొని ఆదివారం ఉదయం మృతి చెందాయి. శింగనమలకు చెందిన కాయల చలమయ్య అనే కాపరికి చెందిన గొర్రెల మంద రాగులకుంట కొండ ప్రాంతానికి వెళ్లగా.. రాత్రి మందపై గుర్తు తెలియని జంతువులు దాడి చేసి ఆరు గొర్రెలను చంపేశాయి. మృతి చెందిన గొర్రెలకు ఆదివారం ఉదయం పశువైద్యాధికారులు పోస్టుమార్టు నిర్వహించారు. ఘటనపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.