ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిసిశాయి. జిల్లాలో 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్ప డుతున్న ముగ్గురు డీబార్ కాగా ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి
ముగిసిన పది పరీక్షలు
Mar 30 2017 11:43 PM | Updated on Sep 5 2017 7:30 AM
304 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసిన 68,853
మంది విద్యార్థులుl ఈ నెల మూడు నుంచి
‘పది’ మూల్యాంకనం
ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిసిశాయి. జిల్లాలో 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్ప డుతున్న ముగ్గురు డీబార్ కాగా ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం ఈ నెల మూడో తేదీ నుంచి పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించడానికి విద్యా శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. పది జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు రెండు వేల మందిని నియమించినట్లు, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షా పత్రాల మూల్యాంకనం చేపడతారని డీఈఓ ఎస్. అబ్రహాం తెలిపారు.
Advertisement
Advertisement