పోర్ట్ ల్యాండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు | TS Formation Day celebrations in association with TDF in Portland | Sakshi
Sakshi News home page

పోర్ట్ ల్యాండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

Jul 7 2016 9:46 PM | Updated on Sep 4 2017 4:20 AM

పోర్ట్ ల్యాండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

పోర్ట్ ల్యాండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

అమెరికాలోని పోర్ట్ల్యాండ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో 2వ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అమెరికాలోని పోర్ట్ల్యాండ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో 2వ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్టు ల్యాండ్ చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాప్టర్ ఛైర్ శ్రీనీ అనుమందల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలకు వచ్చిన వారందరికి  శ్రీనీ అనుమందల తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  శ్రీనీ మాట్లాడుతూ..పోర్ట్ల్యాండ్ చాప్టర్ చేపట్టిన జై కిసాన్, వికలాంగులకు మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాల గురించి వివరించారు. టీడీఎఫ్ ప్రెసిడెంట్ విష్ణు కలవల స్కైప్ ద్వారా మాట్లాడుతూ..పోర్టు ల్యాండ్ టీం చేస్తున్న పలు సేవాకార్యక్రమాలని కొనియాడారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement