కాలువలో యువకుడి మృతదేహం | Young Mans Dead Body Found Floating In Noida Drain | Sakshi
Sakshi News home page

కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

Jan 16 2019 4:41 PM | Updated on Jan 16 2019 8:12 PM

Young Mans Dead Body Found  Floating In Noida Drain - Sakshi

కాలువలో యువకుడి మృతదేహం గుర్తించిన పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ కాలువలో తేలుతున్న యువకుడి మృతదేహాన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్‌ 8లో కాలువలో పడిఉన్న యువకుడి మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. స్ధానికుల సమాచారంతో కాలువ నుంచి యువకుడి మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారని సెక్టార్‌ 20 పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ మనోజ్‌ కుమార్‌ పంత్‌ పేర్కొన్నారు.

మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, కుడి చేయితో పాటు ఛాతీపై విజయ్‌ అనే టాటూ ఉందని, రెండు చేతులపై ఓం అని రాసిఉందని పంత్‌ తెలిపారు. బాధితుడికి 28 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆటోప్సీ నివేదిక వెలుగుచూస్తే యువకుడి మరణానికి స్పష్టమైన కారణం తెలుస్తుందని, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement