ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | Young Man Commits Suicide | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Apr 13 2018 1:46 PM | Updated on Aug 1 2018 2:35 PM

Young Man Commits Suicide - Sakshi

మృతదేహంపై పడి రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మహబూబాబాద్‌ రూరల్‌: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మృ తుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్‌ పట్టణంలో ఆర్టీసీ కాలనీలో నివాసముండే తోట శ్రీనివాస్‌ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌ (ఏడీసీ)గా పని చేస్తున్నారు. శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా రెండో కుమారుడైన తోట రంజిత్‌కుమార్‌ (25) పట్టణంలోని ఓ చిట్‌ఫండ్స్‌లో పని చేస్తున్నాడు..

తనకు వేతనం పెంచాలని సంస్థ యజ మానిని కోరగా రంజిత్‌కుమార్‌ చేసే ఉద్యోగానికి బదులు మరో ఉద్యోగం విధులు నిర్వర్తించాలని, అప్పుడు వేతనం పెంచుతానని చెప్పారు. దీంతో కొద్ది రోజుల క్రితం రంజిత్‌కుమార్‌ అక్కడ పని బంద్‌చేసి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆ సంస్థ కాకుంటే మరో సంస్థలో పని చేయవచ్చని తండ్రి శ్రీనివాస్‌ మృతుడు రంజిత్‌కుమార్‌కు తెలిపాడు. అదే ఆలోచనతో ఉంటూ, మనస్తాపానికి గురైన అతడు గురువారం ఉదయం తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై  టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టౌన్‌ ఎస్సై బి. సంతోష్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement