ఆకతాయి చేష్టలు

 Woman Was Died By Blackmailing - Sakshi

సాక్షి, పాములపాడు(కర్నూలు): ఓ ఆకతాయి బ్లాక్‌మెయిలింగ్‌ యువతి ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలపరిధిలోని లింగాల గ్రామంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  లింగాల గ్రామానికి చెందిన గోవర్దన్, ఆకుతోట సోమేశ్వరమ్మ దంపతుల కుమార్తె విజయనిర్మల (17)కు గడివేముల మండలం గని గ్రామానికి చెందిన  కురువ నవీన్‌ అనే యువకుడితో పరిచయం ఉంది.  ఈ నెల 1న ఆ యువతి తన తండ్రితో కలిసి ఆత్మకూరుకు వెళ్లింది. అక్కడ తండ్రి మోటారు సైకిల్‌ రిపేరి చేయించుకుంటుండగా కొంత దూరంలో నవీన్,  ఆ బాలిక కలిసి మాట్లాడుకుంటున్నారు.

 సిద్దాపురం గ్రామానికి చెందిన  వడ్డె ఇరుగదిండ్ల అశోక్‌ వారి  ఫొటోలు తీసి వాటిని వారికి చూపించి   రూ.5వేలు నగదు, ఒక సెల్‌ ఫొన్‌  తీసుకుని పోయాడు. అంతటితో ఆగకుండా బాలిక తల్లి దండ్రులకు ఫోన్‌ చేసి రూ.5వేలు డిమాండ్‌ చేశాడు. ఇవ్వకపోతే కుమార్తె ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. అడిగిన మేర డబ్బు ఇచ్చేందుకు వారు అంగీకరించినా  వాట్సప్‌లో యువతి ఫొటోలు పంపించాడు.   దీంతో తీవ్రంగా కుంగిపోయిన యువతి ఈనెల 5న ఇంట్లో  ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని బంధువులకు చెప్పకుండా ఖననం చేశారు.  అయితే, తన బిడ్డ ఆత్మహత్మకు కారణమైన నిందితుడు  వడ్డె ఇరుగదిండ్ల అశోక్‌కు  వదిలిపెట్టకూడదని భావించి యువతి తల్లి సోమేశ్వరమ్మ సోమవారం పోలీసులు  ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, తహసీల్దార్‌ శివయ్య, ఎస్‌ఐ వరప్రసాద్‌ శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని వెలికితీసి డాక్టర్‌ వెంకటరమణతో పంచనామా నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top