కీచక బ్యాంకు మేనేజర్‌ను చితకబాదిన మహిళ

Woman thrashes a bank manager for moleting her - Sakshi

సాక్షి, బెంగళూరు : రుణం కావాలంటే కోరిక తీర్చాలంటూ వెకిలీ వేషాలు వేసిన ఓ బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదింది. కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దేవనగెరెలోని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లోన్‌ ఏజెన్సీలో దేవయ్య అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తనకు రుణం కావాలని ఆయనను కోరింది. రూ. 2 లక్షల రుణం ఇప్పించాల్సిందిగా అభ్యర్థించగా.. దేవయ్య వెకిలీ బుద్ధి చూపించాడు. లోన్‌ ఇవ్వాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమె వేధించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ.. సదరు కీచకుడిని రోడ్డుమీదకు లాగి దేహశుద్ధి చేసింది. మొదట కర్రతో చితకబాది.. ఆ తర్వాత చెప్పు తీసుకొని చెడామడా వాయించింది. కన్నడ భాషలో అతన్ని తిడుతూ.. గట్టిగా బుద్ధిచెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top