దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

Woman Molested In Front Of Differently Abled Husband - Sakshi

దిస్పూర్‌ : దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే ఓ భార్య అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన శనివారం  మధ్యాహ్నం అస్సాంలోని బోక్‌పారలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోక్‌పారకు చెందిన వివేక్‌ కున్వర్‌, త్రిశాంత్‌ శర్మ, భాస్కర్‌ బోర్గోహాయ్‌లు శనివారం మధ్యాహ్నం ఓ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఇంట్లోనుంచి బయటకు వచ్చిన దివ్యాంగుడు వారిని ‘ఏం కావాలి’ అని అడిగాడు. వారు ‘దాహంగా ఉంది తాగటానికి నీళ్లు ఇవ్వండి’ అని అడగటంతో అతడు లోపలకు వెళ్లాడు. ఆ వెంటనే ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దివ్యాంగుడిని గాయపరిచి అతడి భార్యపై అత్యాచారం జరిపారు.

బాధితురాలు వారినుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్లకాలేదు. అత్యాచారం అనంతరం ఆ ముగ్గురు అక్కడినుంచి పరారయ్యారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top