విధి రాత.. మృత్యువాత | Wife Deceased Husband Injured in Bike Accident Hyderabad | Sakshi
Sakshi News home page

విధి రాత.. మృత్యువాత

May 26 2020 10:03 AM | Updated on May 26 2020 10:03 AM

Wife Deceased Husband Injured in Bike Accident Hyderabad - Sakshi

ఘట్‌కేసర్‌: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది.  సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన శంకర్, భార్య లహరి దంపతులు స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరారు. మండలంలోని అవుషాపూర్‌ సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న లహరి (30) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను మేడిపల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement