ఏసీబీకి చిక్కిన వీఆర్వో

VRO Caught For Taking Bribe - Sakshi

కశింకోట(అనకాపల్లి): పట్టాదారు పాసు పుస్త కం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిర్మూలనకు సీఎం ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరును బాధితుడు ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకుని అరెస్టు చేశారు.  శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాలిలావున్నాయి.

కారణం లేకుండా దరఖాస్తు తిరస్కారం.. 
మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన గల్లా సత్యనారాయణకు అదే గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్‌ 133/1లో 49.50 సెంట్ల భూమి ఉంది. దీని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలే దు. దీంతో  ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని 2012లో రెండు దఫాలు తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు. అధికారులు అకారణంగా వాటిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ గత డిసెంబర్‌ నెలలో తనకు రైతు భరోసా పథకం సొమ్ము పొందేందుకు తన భూమి వివరాలను ఆన్‌లైన్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అయితే ఇందుకు రూ.3 వేలు ఇవ్వాలని తాళ్లపాలెం వీఆర్వో పీవీ రాజేష్‌ డిమాండ్‌ చేశారు.

ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదుతో.. 
అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబరు 14400కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. వాస్తవమేనని వెల్లడవడంతో వారు రంగంలోకి పథకం రూపొందించారు. సత్యనారాయణ బంధువైన చప్పగడ్డ ప్రసాద్‌ ద్వారా వీ ఆర్వో రాజేష్‌కు లంచం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా వీఆర్వో రూ.2 వేలకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నగదు ఇచ్చిన వెంటనే.. 
నగదు ఇచ్చిన వెంటనే  పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి వీఆర్వో అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు  ప్రసాద్‌తో నాలుగు రూ.500 నోట్లు పంపించారు. వీటిని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీఆర్వో రాజేష్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వా«దీనం చేసుకొని రాజే‹Ùపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ఈ దాడిలో సీఐలు గఫNర్, రమే‹Ù, లక్ష్మణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ దాడితో రెవెన్యూ సిబ్బంది కలవరం చెందారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top