పాత నోట్లు మార్చే ముఠా గుట్టురట్టు | Vizag Police Arrested The Gang Who Circulates Fake Currency | Sakshi
Sakshi News home page

పాత నోట్లు మార్చే ముఠా గుట్టురట్టు

Aug 21 2019 3:46 PM | Updated on Aug 21 2019 3:58 PM

Vizag Police Arrested The Gang Who Circulates Fake Currency  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పాత నోట్లు ఇస్తే, ఆ మొత్తానికి మూడు రెట్లు రెట్టింపు ఇస్తామంటూ ఆశ చూపి మోసానికి పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రద్దయిన పాత నోట్లను మార్చే ఈ ముఠా సభ్యుల నుంచి 500, 1000 రూపాయల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..ఓ వాహనంలో తరలిస్తున్న కోటి 57 వేల విలువైన పాత కరెన్సీతో పాటు, 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  నిందితుల నుంచి నకిలీ కారు నెంబర్ ప్లేట్లు, వాకీ టాకీలు, డమ్మీ తుపాకీలు, పోలీస్ పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా మాట్లాడుతూ ...ఈ ముఠా సభ్యులు పాత నోట్ల కోసం డమ్మీ తుపాకీలు, వాకీ టాకీలు, పోలీస్ స్టిక్కర్లతో బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. నకిలీ, పాత నోట్ల చెలామణిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే విశాఖలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్డి సారించామని ఎస్పీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement