ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ | UnIdentified Woman Died | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మృతి 

May 8 2018 9:19 AM | Updated on May 8 2018 9:19 AM

UnIdentified Woman Died - Sakshi

గుర్తు తెలియని మహిళ మృతదేహం

కడ్తాల్‌(కల్వకుర్తి) రంగారెడ్డి : గుర్తు తెలియని మహిళ కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాలు.. ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని మహిళ(50), మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలో అనారోగ్యంతో బాధపడుతూ పడి ఉంది.

స్థానికుల సమాచారం మేరకు గుర్తు తెలియని మహిళను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement