ఇద్దరు మహిళల అరెస్టు

Two Woman Arrest In Fake Documents Reports For Bail - Sakshi

ఓ మహిళ బెయిల్‌ కోసం తప్పుడు

ధ్రువపత్రాల సమర్పణ  

న్యాయవాది అరెస్టుకు రంగం సిద్ధం

తెనాలి రూరల్‌ : చోరీ కేసులో బెయిల్‌ నిమిత్తం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు గానూ ఇద్దరు మహిళల్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరికి సహకరించిన నర్సరావుపేటకు చెందిన న్యాయవాది అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. వివరాలు..2016లో పట్టణంలో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి నిందితురాలు అరుణను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి అదే ఏడాది కోర్టులో హాజరుపర్చారు. ఆమె బెయిల్‌ కోసం వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళలు గండికోట శివ, ముద్రబోయిన వెంకటరత్నం హామీ ఇస్తామంటూ ముందుకొచ్చారు.

రేపల్లె మండలం ఉప్పుడి గ్రామంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉన్నాయంటూ నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించగా, అరుణ బెయిల్‌ పొందింది. ఈ పత్రాల పరిశీలనకు రేపల్లె ఎంపీడీవో కార్యాలయానికి రాగా, నకిలీవని తేలింది. ఎంపీడీవో సుధారాణి ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో టూ టౌన్‌ పోలీసులు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి నర్సరావుపేటకు చెందిన న్యాయవాది బి. కల్యాణ్‌ సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని, త్వరలో అరెస్టు చేస్తామని ఎస్‌ఐ జె. క్రాంతికిరణ్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top