సినీ ఫక్కీలో కిడ్నాప్‌

Two People Kidnapped In Karnataka In Cinema Style - Sakshi

సాక్షి, బెంగళూరు : ముగ్గురు స్నేహితులు..ఒక కిడ్నాప్‌...మూడు కోట్లు డిమాండు...కట్‌ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిందితులు...అచ్చం క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తుంది ఈ స్టోరీ. ఐజీపీ శరత్‌చంద్ర మంగళవారం నెలమంగలలో పాత్రికేయుల సమావేశంలో అందించిన వివరాల మేరకు... యలహంక ఉపనగర్‌లోని మాత కాలనీ నివాసి, వ్యాపారవేత్త  ఎం సిద్ధరాజు గత నెల ఆగస్టు 26న ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు హేమంత్‌ (16)ను, హేమంత్‌ కారు డ్రైవర్‌ కేశవరెడ్డిని అపరిచితులు కిడ్నాప్‌ చేసారని, రూ. 3 కోట్లు డిమాండు చేస్తున్నారని రాజానుకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడే జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రవి డీ చెన్నన్ననవర్‌ ఈ కేసుని సవాలుగా తీసుకున్నారు.

కిడ్నాపర్‌లను పట్టుకోవడంతోపాటు కిడ్నాప్‌కుగురైన ఇద్దరినీ క్షేమంగా తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లాలోని పోలీస్‌ ఉన్నతాధికారులు 35 మంది గల దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు సిద్ధరాజును ఫోన్‌లో కాంటాక్టు చేసిన ప్రతీసారీ వారి లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తూ వెళ్లారు. ట్రాప్‌లో భాగంగా మూడు కోట్లలో మొదట ఒకటిన్నర కోటి ఇస్తామని నమ్మించారు. కనకపుర రోడ్డులోని నైస్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ఒక చోట డబ్బు ఉంచామని నిందితులకు చెప్పారు. ఈ మాటలు నమ్మిన నవీన్‌ అనే నిందితుడు మంగళవారం తెల్లవారుజామున డబ్బులు తీసుకోవడానికి రాగా పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు డ్య్రాగర్‌తో అనేకల్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ హేమంత్‌కుమార్‌పై దాడిచేసి గాయపరిచాడు.

దీంతో ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ వెంటనే ఆత్మరక్షణ కోసం నిందితుడి కాలికి షూట్‌ చేసారు. పట్టుబడ్డ నిందితుడిని విచారించిన పోలీసులు మిగతా నిందితుల ఆచూకీ గంటల్లోనే కనిపెట్టారు. నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పీఎస్‌ పరిధిలోని జనప్రియ టౌన్‌íÙప్‌ వద్ద ఉన్న నీలగిరి తోపులో దాక్కున్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో నిందితులు తాము కిడ్నాప్‌ చేసిన హేమంత్, కేశవరెడ్డిలను కత్తితో పొడుస్తామని చంపేస్తామని బెదిరించారు. ఈక్రమంలో కానిస్టేబుల్‌ మధుకుమార్‌పై నిందితులు డ్య్రాగర్‌తో దాడిచేసి గాయపరిచారు. దీంతో మాదనాయకనహళ్లి సీఐ సత్యనారాయణ నిందితులపై కాల్పులు జరిపారు. కిడ్నాప్‌నకు గురైన ఇద్దరినీ రక్షించిన పోలీసులు గాయపడ్డ నిందితులను ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top