ఫేస్‌బుక్‌ ప్రేమ కోసం..

Twist In Jewellery Robbery Case Facebook Lover Arrest Chittoor - Sakshi

నగలను ప్రియుడికిచ్చి.. దొంగలు దోచుకెళ్లారని నాటకమాడిన వివాహిత

తప్పుడు ఫిర్యాదుతో పోలీసులను బురిడీ కొట్టించే యత్నం

నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన ఖ>కీలు

చిత్తూరు, పాకాల: తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను పక్కదారి పట్టించాలని యత్నించిన ఓ వివాహిత, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. పాకాల గాంధీనగర్‌కు చెందిన స్వాతిప్రియ మే 11న రైల్వే కాలనీలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారంచల్లి 176 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తు న్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెల్ల్లడయ్యాయి.

వివాహిత స్వాతిప్రియకు ఫేస్‌బుక్‌లో తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుడూరుకు చెందిన పవన్‌కుమార్‌ అలియాస్‌ (అఖిల్‌)(25)తో పరిచయం ఏర్ప డి ప్రేమకు దారి తీసింది. దీంతో ఇరువురు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని పథకం ప్రకారం ఆమె వద్దనున్న నగలను పవన్‌కుమార్‌ని నేండ్రగుంట వద్దకు రమ్మని అతనికి అందజేసింది. తరువాత రైల్వే కాలనీకి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తులు తన వద్ద నుంచి నగలు లాక్కెళ్లారని గగ్గోలు పెట్టింది. అయితే విచారణలో అసలు విషయం తెలియడంతో ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పవన్‌ కుమార్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top