కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి  | Thugs Attacked Constable In Gooty Anantapur | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

Aug 29 2019 7:20 AM | Updated on Aug 29 2019 7:21 AM

Thugs Attacked Constable In Gooty Anantapur - Sakshi

సాక్షి, గుత్తి(అనంతపురం) : కానిస్టేబుల్‌ దంపతులపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గుత్తి మండలం బసినేపల్లి తండా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసినేపల్లి తండాకు చెందిన ఎం.వెంకటేష్‌ నాయక్‌ ఓడీచెరువులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన తన భార్యతో కలిసి బుధవారం రాత్రి బైక్‌లో బసినేపల్లి తాండాకు బయలుదేరాడు.

తండా సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద దుండగులు దారిలో కంప చెట్లు అడ్డం పెట్టారు. వెంకటేష్‌ నాయక్‌ ద్విచక్ర వాహనం దిగి కంప చెట్లను తొలగిస్తున్నాడు. ఇంతలో అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు ఒక్క ఉదుటున దంపతులపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి వద్దనున్న రెండు సెల్‌ఫోన్లు, కొంత డబ్బు లాక్కొని  పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ దంపతులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండావాసులు బ్రిడ్జి వద్దకు వచ్చి దుండగుల కోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు పారిపోయారు.      

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement