కంచె దాటే యత్నం; ఆరుగురు హతం

Terrorists Infiltration Along LOC Foiled By Security Forces, Six Killed - Sakshi

శ్రీనగర్‌: భారత భద్రతా బలగాలు కుపర్వా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఆదివారం పాకిస్తాన్‌ తీవ్రవాదుల భారీ చొరబాటుని అడ్డుకున్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నిసున్న ఆరుగురిని కాల్చి చంపాయి. కీరన్‌ సెక్టార్‌లో ఆదివారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ‘దేశంలోకి చొరబాటుకు యత్నించిన ఆరుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకుపోయిన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చ’ని రక్షణ శాఖ ప్రతినిధినొకరు తెలిపారు. 

కాగా, జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధికార ప్రతినిధి శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెక్కకు మించి భద్రతా దళాలను మోహరిచండంతోనే అనేక మంది యువకులు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు నిజం కాదని అన్నారు. పవిత్ర రంజాన్‌ సందర్భంగా భారత భద్రతా బలగాలు ఎటువంటి తీవ్రవాద నిర్మూలన ఆపరేషన్లు చేపట్టలేదనీ, కాల్పుల విరమణ పాటిస్తున్నాయని గుర్తు చేశారు. కశ్మీర్‌ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనీ, అయినా కొంతమంది యువకులు తీవ్రవాదం అడుగులేస్తున్నారని ఆర్మీ మాజీ బ్రిగేడియర్‌ అనిల్‌ గుప్తా అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top