పోలీసుల అదుపులో కీచక గురువు

Sri Chaitanya College Lecturer Arrested In Molestation On Student - Sakshi

అనంతపురం: నగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ గురువు కీచక అవతారమెత్తాడు. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం కీచక గురువు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితుల బంధువుల వివరాల మేరకు... నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థినిని కెమెస్ట్రీ లెక్చరర్‌ కిరణ్‌ కొంతకాలంగా వేధిస్తున్నాడు. సూటిపోటి మాటలు మాట్లాడుతుండడంతో రెండు నెలలుగా కళాశాలకు పోవడమే మానేసింది.

కారణాలు ఆరా తీస్తున్నప్పటికీ విద్యార్థిని బయటకు చెప్పకపోవడంతో తల్లిదండ్రులు బతిమలాడుతూ వచ్చారు. సోమవారం గట్టిగా మందలించడంతో జరిగిన విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేసింది. రోజూ సెల్‌కు ఫోన్‌ చేయడంతో పాటు వాట్సాప్‌లో కూడా మేసేజ్‌ చేయాలని వేధిస్తున్నట్లు వాపోయింది. దీంతో బాధితురాలి తండ్రి మంగళవారం ఉదయం ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు కీచక్‌ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టూటౌన్‌ సీఐ ఆరోహనరావు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top