
విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంబటివలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ ఎస్‌ఐ దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం పీటీసీలో విధులు నిర్వర్తిస్తున్న కనకల కాశీ విశ్వనాథ్ అనే ఎస్‌ఐ తన పల్సర్ బైక్‌పై ద్విచక్ర వాహనంలో వస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌ను లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.