థరూర్‌ ఇంటర్వ్యూకు వెళ్లిన మహిళా జర్నలిస్టును.. | Security guard held for molesting TV journalist | Sakshi
Sakshi News home page

థరూర్‌ ఇంటర్వ్యూకు వెళ్లిన మహిళా జర్నలిస్టును..

Oct 5 2017 5:22 PM | Updated on Jul 23 2018 8:49 PM

Security guard held for molesting TV journalist - Sakshi

సాక్షి, బెంగళూరు : జర్నలిస్టును వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల (సెప్టెంబర్‌) 27న శశిథరూర్‌ బెంగళూరు వచ్చి ఓ హోటల్‌లో దిగారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ మహిళా టీవీ జర్నలిస్టు అక్కడి హోటల్‌కు చేరుకున్నారు. ఆయన అనుమతి కూడా ముందే తీసుకున్నారు.

అయితే, ఆ హోటల్‌ ముందు ఉన్న సిబ్బంది మాత్రం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. లైంగికంగా తడమడంతోపాటు చేయి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరిని వేలాయుధన్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిది మహదేవపురా అని తెలుసుకొని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement