
సాక్షి, కృష్ణా: జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఉయ్యూరు పట్టణంలోని టీవీఎస్ షోరూం డీలర్ నివాసంలో గుర్తు తెలియని దుండగులు మంగళవారం దొంగతనానికి పాల్పడ్డారు. నేడు ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ అడ్మిన్ డీసీపీ హరికృష్ణ, ఈస్ట్ జోన్ ఏసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా షాపు యజమాని శబరిమల వెళ్లాడని, ఈ విషయం తెలిసిన వాళ్లే పక్కాగా దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.