ముద్దు పెట్టిన విద్యార్థి అరెస్టు | Police Arrest Student in Forced Kiss Case Tamil nadu | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టిన విద్యార్థి అరెస్టు

Apr 15 2019 9:04 AM | Updated on Apr 15 2019 9:04 AM

Police Arrest Student in Forced Kiss Case Tamil nadu - Sakshi

కలిసి తీసుకున్న సెల్ఫీ ఫొటోను డెలీట్‌ చేయాలంటే

తిరువొత్తియూరు: కలిసి తీసుకున్న సెల్ఫీ ఫొటోను డెలీట్‌ చేయాలంటే తనకు ముద్దు పెట్టాలని బెదిరించి విద్యార్థినికి ముద్దు పెట్టిన విద్యార్థిన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ దృశ్యాన్ని ఫొటో తీసిన అతని స్నేహితున్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మడిపాక్కం పాలయాగార్డెన్స్‌కు  చెందిన యువతి (18) ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. పాఠశాల దశ నుంచే యువతికి పరిచయం ఉన్న శ్రీనాథ్‌ ఆమెను ప్రేమిస్తున్నాడు.

కాని అతని ప్రేమను విద్యార్థిని తిరస్కరించింది. ఈ క్రమంలో మహాబలిపురం వెళ్లిన సమయంలో విద్యార్థినితో కలిసి శ్రీనాథ్‌ సెల్ఫీ తీశాడు. ఆ ఫొటోను ఆమెకు చూపించాడు. తనకు ముద్దు పెట్టాలని లేదంటే ఈ ఫొటోను మీ కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించాడు. ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీంతో ఆమె ముద్దు పెట్టింది. అయితే ముద్దు పెడుతున్న దృశ్యాన్ని మరో విద్యార్థి ఫొటో తీసినట్లు తెలిసింది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం శ్రీనాథ్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement