వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి మృతి

Patient Dies In Ruia Hospital Because Of Doctor Negligence - Sakshi

సాక్షి, తిరుపతి : సిబ్బంది నిర్లక్ష్యం, సదుపాయాల లేమి కారణంగా ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగింది. తిరుపతికి చెందిన బాబు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని జనరల్‌ వార్డులో చేర్చారు. అనంతరం అక్కడి సిబ్బంది, డాక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత బాబుకి ఫిట్స్‌ వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మానవత్వంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడి స్టెచర్‌ లేదంటూ దాదాపు అరగంట పాటు అతన్ని ఆపారు. తర్వాత వైద్యులు వచ్చి బాబుని పరీక్షించి మృతి చెందారని తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతపెద్ద ఆస్పత్రిలో కనీసం రోగులను తీసుకెళ్లడానికి స్టెచర్‌ లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ సందర్శించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం​.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top