విచిత్రం: 2వేల నోట్లు మాత్రమే చోరీ! | only two thousand notes are theft in hindu temple | Sakshi
Sakshi News home page

విచిత్రం: 2వేల నోట్లు మాత్రమే ఎత్తుకెళ్లారు!

Oct 20 2017 7:51 PM | Updated on Aug 30 2018 5:27 PM

only two thousand notes are theft in hindu temple - Sakshi

చంఢీగఢ్‌: పంజాబ్‌లోని ఓ ఆలయంలో గురువారం రాత్రి విచిత్రమైన చోరీ జరిగింది. అయితే ఆ దుండగులు కేవలం రూ.2 వేల నోట్లను మాత్రమే చోరీ చేయడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమృత్‌సర్‌లోని దుర్గియానా దేవాలయ హుండీని పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు అందులో ఉన్న రూ.7 లక్షల వరకు ఉన్న రూ.500, రూ.1000నోట్లను వదిలేసి.. రూ.6లక్షల విలువచేసే రూ.2000నోట్లను మాత్రమే ఎత్తుకెళ్లారు. నేటి (శుక్రవారం) ఉదయం చోరీ విషయం బయటపడింది. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆలయం ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీ సమయంలో కొన్ని కెమెరాల లెన్స్‌లను దుండగులు మూసేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తూ కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ రూ.2లక్షలకు పైగా ఆదాయం వస్తుందని, అదే పండుగ రోజుల్లో రూ.10లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుందని సమాచారం. సిక్కుల ప్రార్థనాస్థలం స్వర్ణ దేవాలయానికి సమీపంలోనే ఈ హిందూ ఆలయం ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement