సెల్‌ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బుబిళ్ల వచ్చింది

కృష్ణరాజపురం : ఆన్‌లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. వేలాది రూపాయలు వెచ్చించి ఆన్‌లైన్ షాపింగ్‌లో ఖరీదైన మొబైళ్ల తదితర వస్తువులకు ఆర్డర్ చేస్తే ఇటుకలు,రాళ్లు, సబ్బులు వస్తున్నాయి. అయినా వినియోదారులు ఆన్‌లైన్ లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా వంచకులు అమాయకులకు వల వేస్తున్నారు. అలాంటిదే ఈ ఘటన. ఉత్తరహళ్లికి చెందిన వెంకటేశ్ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో పేటీఎం ద్వారా రూ.85వేల విలువ చేసే స్యామ్‌సంగ్ మొబైల్ కొనుగోలు చేశారు.
మంగళవారం డెలివరీ బాయ్ పార్సిల్ అందించి వెళ్లిపోయిన అనంతరం ఆతృతగా, ఆనందంగా మొబైల్‌బాక్స్ తెరచిచూసిన వెంకటేశ్‌కు.. బాక్స్‌లో మొబైల్‌కు బదులు రూ.5 విలువ చేసే సబ్బు ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. తానుమోసపోయినట్లు గుర్తించి సుబ్రహ్మణ్యపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి