భర్తకు విషం ఇచ్చిన నవ వధువు

New Bride Trying To Kill Her Husband By Giving Poisson In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక  జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష‍్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారు.

ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో అత్తవారింటికి వచ్చిన నాగమణి భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చింది. వీటిని తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు ఈ కేసును దర్యాప్తులో భాగంగా జొన్నగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top