పిల్లలతోసహా తల్లి ఆత్మహత్యాయత్నం

Mother Commits Suicide Attempt in Anantapur - Sakshi

ఘటనలో 16 నెలల     చిన్నారి మృతి  

పీసీ.చిన్నప్యాపిలి(వజ్రకరూరు): పిల్లలతో సహా తల్లి బావిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిన్నప్యాపిలి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన సుమంగళికి కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన కిష్టప్పతో  ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారులు చరణ్, విఘ్నేష్, కుమార్తె వేదిక ఉన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని సుమంగళి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావి వద్దకు పిల్లలతో సహా వెళ్లింది. అయితే పెద్ద కుమారుడు చరణ్‌ అక్కడి నుంచి తప్పించుకుని బయటకువచ్చాడు. అనంతరం సుమంగళి మిగిలిన ఇద్దరు పిల్లలతో సహా బావి లోకి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే బావిలో పడ్డ తల్లీపిల్లలను బయటకు తీశారు. అయితే అప్పటికే వేదిక(16 నెలలు) మృతి చెందింది. అస్వస్థతకు గురైన విఘ్నేష్‌ను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. సుమంగళి మానసిక స్థితి సరిగా లేక పోవడం వల్లే బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top