
పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తల్లీ, కొడుకు సజీవదహనమయ్యారు. మృతులను గొట్టే యశోద, (45), గొట్టే రోహన్ (18) గా పోలీసులు గుర్తించారు. సిలిండర్ పేలుడుతో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.