కారు ఢీకొని తల్లీ కుమారుడు దుర్మరణం

Mother And Son Died in Car Accident Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన నెరుప్పూర్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా పెన్నాగరమ్‌ తాలూకా ఏరియూర్‌ సమీపంలో ఉన్న నెరుప్పూర్‌కి చెందిన గోవిందన్‌. ఇతని భార్య ఇంద్రాణి (47). గోవిందన్‌ కొన్నేళ్లు ముందు మృతిచెందాడు. కొండైయనూరులో పౌష్టికాహార నిర్వాహకురాలిగా ఇంద్రాణి పని చేస్తోంది. వీరికి కార్తికేయన్‌ (25) అనే కుమారుడు, ప్రియ (22), అనే కుమార్తె ఉన్నారు.

కార్తికేయన్‌ బీఈ పట్టభద్రుడు. చెన్నైలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ప్రియ చెన్నైలో డెంటల్‌ మెడికల్‌ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం సాయంత్రం ఇంద్రాణి, కార్తికేయన్‌ ఇద్దరూ నెరుప్పూర్‌ నుంచి బైక్‌లో ఏరియూర్‌ వైపు వెళుతున్నారు. నెరుప్పూర్‌ సమీపంలో బైక్‌ వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇంద్రాణి, కార్తికేయన్‌ ఇద్దరూ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఏరియూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పెరుమాల్‌ (40) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top