కోడలిపై మామ లైంగిక దాడి..

Molestation Attack On Daughter In Law - Sakshi

ఆలస్యంగా వెలుగులోకి..

పోలీసుల అదుపులో నిందితుడు

బొబ్బిలి: కుమార్తెలా సాకాల్సిన కోడలిని ఓ ప్రబుద్ధుడు తన కామవాంఛతో పాడు చేశాడు. తన అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని  ఒకసారి కాదు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారానికి సంబంధించి బొబ్బిలి సీఐ ఇ. కేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత బొబ్బిలి ప్రసాద్‌నగర్‌ కాలనీలో ఇరవై ఏళ్ల ఎస్సీ వివాహిత భర్తతో కలసి నివాసముంటోంది. ఆదివారం తన భర్త పనికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఇంటి వద్ద ఉంది. దీంతో అదను చూసిన తన చినమామ ఇంటిలోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా ఆమె కేకలు వేయబోయింది.

అయితే కామాంధుడు ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యం చేశాడు. అనంతరం కామాంధుడు పారిపోవడంతో ఆమె వణికిపోతూ బయటకు వచ్చింది. చెప్పుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఎదురుగా ఉన్న ఇంటి వద్దకెళ్లి వారికి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. గతంలో కూడా ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. వెంటనే వారు విషయాన్ని గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారం అందజేశారు. అలాగే బాధితురాలి భర్తకు కూడా తెలియజేశారు. దీంతో బొబ్బిలి ఏఎస్పీ గౌతమీ శాలి, సీఐ కేశవరావు సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. నిందితుడు పరారు కావడంతో సోమవారం అతడ్ని పట్టుకుని కేసు నమోదు  చేశారు.

ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం.. 
ఇది చాలా దారుణమైన సంఘటన. కేసు వివరాలను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాం. ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా చార్జిషీటుతో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించాం.
– గౌతమీ శాలి, ఏఎస్పీ,బొబ్బిలి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top