రుణం పేరుతో మోసం.. మహిళ అరెస్ట్‌ | Men And Woman Arrest in Bank Loan Cheating Case | Sakshi
Sakshi News home page

రుణం పేరుతో మోసం.. మహిళ అరెస్ట్‌

Published Fri, Dec 6 2019 11:58 AM | Last Updated on Fri, Dec 6 2019 11:58 AM

Men And Woman Arrest in Bank Loan Cheating Case - Sakshi

తమిళనాడు ,  అన్నానగర్‌: చెన్నై సమీపంలో బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని సర్టిఫికెట్లు తీసుకొని, వాటి మూలంగా ఇంటి ఉపయోగ వస్తువులు కొని వినూత్న విధానంలో రూ.8 లక్షలు మోసం చేసిన మహిళతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం కేకే గార్డన్‌కి చెందిన మీనా (35), పారిమునై 3వ సముద్రతీర రోడ్డుకు చెందిన శంకర్‌ (30) ఇద్దరూ బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తామని ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటించారు. ఇది నమ్మిన పారిమునైకు చెందిన పౌసియా బేగమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రు వారిని కాంటాక్ట్‌ చేశారు. రుణం ఇప్పిస్తామని వారి వద్ద ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు జిరాక్స్, ఫొటో వంటి సర్టిఫికెట్లు తీసుకున్నారు.

ఈ స్థితిలో వీరందరి సెల్‌ఫోన్‌లకి, నెలంతర విధానంలో ఇంటి ఉపయోగ వస్తువులు కొనడం వల్ల మొదటి నెల ఈఎమ్‌ఐ కట్టమని మెసేజ్‌ వచ్చింది. దీన్ని చూసి ముగ్గురూ  దిగ్భ్రాంతి చెందారు. విచారణలో బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని తమ వద్ద సర్టిఫికెట్లు తీసుకున్న మీనా, శంకర్‌ లిద్దరూ ఆ సర్టిఫికెట్లు ఇచ్చి ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసి మోసం చేసినట్లు తెలిసింది. ముగ్గురూ తనిగ వడక్కు సముద్రతీర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేసి విచారణ చేశారు. ఇందులో వారు బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తామని నమ్మించి సర్టిఫికెట్లు తీసుకొని వారి పేరుతో ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసినట్లు తెలిసింది. ఇలా రూ.8 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. అనంతరం మీనా, శంకర్‌ని అరెస్ట్‌చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement