
చింతూరు (రంపచోడవరం): ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల తోపాటు విలీన మండలాల్లో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ దళ కమాండర్ ఉబ్బా మోహన్‌రావు అలియాస్ సునీల్ మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినట్లు భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్ చెప్పారు.
సునీల్‌పై చింతూరుతో పాటు తెలంగాణలోని దుమ్ముగూడెం, చర్ల పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. దుమ్ముగూడెం మండలం అంజి బాకకు చెందిన సునీల్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 2013లో అప్పటి ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ ప్రోత్సాహంతో శబరి ఏరియా కమిటీలో దళ సభ్యుడిగా చేరాడు. అనంతరం 2015లో డిప్యూటీ కమాండర్, 2016 నుంచి దళ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.