‘కాల్‌సెంటర్ల గుప్పిట్లో 14 లక్షల మంది డేటా’

Man Steals Data Of E Shoppers Arested In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంబీఏ చదివిన ఓ యువకుడు 14 లక్షల మంది ఈకామర్స్‌ కస్టమర్ల డేటాను తస్కరించి మోసపూరిత కాల్‌సెంటర్లకు విక్రయించి సొమ్ముచేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ హైటెక్‌ మోసగాడిని నోయిడాలోని తన కార్యాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను బురిడీ కొట్టించేందుకు ఏర్పాటైన మోసపూరిత కాల్‌సెంటర్లకు అక్రమంగా డేటాను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై నందన్‌ రావు పటేల్‌ అనే యువకుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

డేటా చోరీపై కస్టమర్లతో పాటు పలు బ్యాంకులూ ఫిర్యాదు చేయడంతో అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బిహార్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్‌ చేసి రెండు మొబైల్‌ ఫోన్లు, 14 లక్షల మంది కస్టమర్ల డేటాతో కూడిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌ ఉద్యోగుల సహకారంతో ఒక్కో కస్టమర్‌ డేటాను రూ 2-3కు సేకరించి నకిలీ కాల్‌సెంటర్లకు ఒక్కో కస్టమర్‌ డేటాను రూ 5-6కు విక్రయించేవాడినని నిందితుడు అంగీకరించాడని నోయిడా అడిషనల్‌ ఎస్పీ విశాల్‌ విక్రం సింగ్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top