
హల్‌చల్ చేస్తున్న పట్టాభి నాయుడు(ఫైల్)
చంద్రగిరి: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ముంగళిపట్టులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై దాడికి యత్నించిన పట్టాభినాయుడును పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చినట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. అలాగే దళితులపై దాడి చేసిన ఘటనలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎదుట హాజరు పరచి విచారణ అనంతరం రిమాండ్‌కు పంపించామన్నారు.