ప్రేమికుల ఆత్మహత్యాయత్నం | lovers Commits Suicide Attempt in Krishna | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Sep 8 2018 1:50 PM | Updated on Sep 8 2018 1:50 PM

lovers Commits Suicide Attempt in Krishna - Sakshi

సంధ్య (ఫైల్‌) సాధిక్‌ (ఫైల్‌)

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే కారణంతో పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. యువతి సాదం సంధ్య (20) మృతి చెందగా యువకుడు షేక్‌ సాదిక్‌ విజయవాడలోని ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు. సంధ్య పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. సాధిక్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. వీరిద్దరి కుల, మతాలు వేరు కావటంతో ఇరు వైపులా పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. సంధ్య తల్లిదండ్రులు ఆమెకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ బలవన్మరణానికి యత్నించారు.

కృష్ణాజిల్లా, అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): ప్రేమికులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. యువతి మృతి చెందగా యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ అవినాష్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సాదం సంధ్య (20), షేక్‌ సాధిక్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సాధిక్‌ బీటెక్‌ పూర్తి చేయగా, సంధ్య పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. వీరిద్దరి మతాలు వేరు కావటంతో ఇంట్లో పెళ్లికి అంగీకరించలేదు. గురువారం రాత్రి కలుసుకున్న వీరిద్దరు పురుగుల మందు తాగి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. సాధిక్‌ ఇంట్లో వాంతులు చేసుకోవటంతో కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స కోసం విజయవాడ తరలించారు. సంధ్య అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. అయితే ఘటనపై కేసులు నమోదు చేసేందుకు ఇరు కుటుంబాలు ముందుకు రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement