ప్రేమ వివాదం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య | love Controversy constable suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాదం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Feb 6 2018 8:17 AM | Updated on Mar 19 2019 6:01 PM

love Controversy constable suicide  - Sakshi

నాగరాజ్‌ (ఫైల్‌)

బనశంకరి: చిన్నపాటి మనస్పర్థల కారణంగా ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రేమికురాలు కూడా బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఉడిపి జిల్లా కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాలు... దావణగెరె జిల్లా మలెబెన్నూరు హిడగనగట్టి గ్రామానికి చెందిన నాగరాజు (27) ఉడిపి జిల్లా కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇదే పీఎస్‌లో రమ్య (23) మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇరువైపులా కూడా వీరి పెళ్లికి సమ్మతించారు. ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న విషయాలకు త రచూ గొడవపడేవారు. ఆదివారం తెల్లవారుజామున నాగరాజు తన చావుకు ఎవరూ కారణంగా కాదని లేఖ రాసి క్వార్టర్స్‌లోనే ఫ్యాన్‌కు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త తెలియగానే రమ్య స్టేషన్‌ ఆవరణలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. సహచర పోలీసులు హుటాహుటిన బావిలోకి దిగి ఆమెను కాపాడారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement