భూ తగదాలు.. కొడవళ్లతో పరస్పర దాడులు..

Land Issues : Two Families Attacks With Knives In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : భూ తగదాలతో  రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జిల్లాలోని మొలకలచెరువు మండలం మలిగివారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ఇరువురు కొడవళ్లతో పరస్పర దాడులు జరిపారు. మనీ అనే వ్యక్తిపై జయరాం అనే యువకుడు కొడవలితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన మణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top