థానూర్ : నిర్మల్‌జిల్లా థానూరు మండలంలో దారుణం జరిగింది. తన భార్యను హత్య చేసిన భర్త దొంగలు చంపారని నాటకమాడాడు. చివరకు పోలీసుల ఎదుట నిజం ఒప్పుకోక తప్పలేదు. ఈ సంఘటన థానూరు మండలంలోని వడ్గాం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సునీత(32), రాహుల్ భార్యాభర్తలు. గురువారం రాత్రి ఇద్దరూ కలిసి జొన్న చేను కావలికి వెళ్లారు. అక్కడ తన భార్యను రాహుల్ చంపేశాడు. అనంతరం గ్రామంలోకి వెళ్లి సునీతను దొంగలు హతమార్చి పారిపోయారని చెప్పాడు. ఆ విషయం పోలీసులకు చేరడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా సునీతను తానే చంపానని అసలు విషయం బయటపెట్టాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.