గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

Indecent Activity Guest House Was Seized by Police In Vizag - Sakshi

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు

విటులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, విశాఖ: అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుతో నగరంలోని ఓ గెస్ట్‌ హౌస్‌ను ద్వారకాజోన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ వెనుక భాగంలోని మార్గంలో గల శ్రీసాయి గెస్ట్‌ హౌస్‌ను డీసీపీ–1 ఎస్‌.రంగారెడ్డి ఆధ్వర్యంలో సీఐ వై.మురళి నేతృత్వంలో బుధవారం రాత్రి పోలీసులు సీజ్‌ చేశారు. డీసీపీ రంగారెడ్డి ఆధ్వర్యంలో  తహసీల్దార్‌ వై. అప్పలరాజు, ఎస్‌ఐలు స్వామినాయుడు, దాలిబాబు, కాంతారావు ఈ దాడుల్లో  పాల్గొన్నారు.

గెస్ట్‌హౌస్‌ యజమాని దుబాయిలో ఉండటంతో మేనేజర్‌ రమణ గెస్ట్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. గతంలో ఈ గెస్ట్‌హౌస్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఇక్కడ ఒక యువతితో పాటు ఇద్దరు విటులను ద్వారకాజోన్‌ పోలీసులు పట్టుకున్నారు. విటులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా గదులను తనిఖీ చేశారు. గెస్ట్‌హౌస్‌ రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు సహించం
డీసీపీ రంగారెడ్డి మాట్లాడుతూ గెస్ట్‌ హౌస్‌ల్లో, లాడ్జిల్లో దిగేముందు ఆధార్‌ వంటి గుర్తింపు కార్డు జిరాక్స్‌ తీసుకుని, రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహిం చేది లేదని హెచ్చరించారు. అటువంటి హోటళ్లు, లాడ్జిలను సీజ్‌ చేస్తామన్నారు. హోటళ్లు, లాడ్జీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పే ర్కొన్నారు. ద్వారకాజోన్‌ పోలీసులు కేసు నమో దు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది , పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top