ప్రియునితో కలిసి భర్తను చంపి.. ఆపై ఏఎస్సైతోనూ..!

With Illicit Relationship Wife Who Murdered Her Husband In Mandya - Sakshi

మండ్య జిల్లాలో.. 2017 జూలైలో ఘటన  

ఎట్టకేలకు ఇద్దరూ అరెస్టు

నిందితురాలికి సహకరించిన ఏఎస్‌ఐపై విచారణ 

సాక్షి, మండ్య: ప్రియునితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియున్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మండ్య తాలూకాలోని రాజేనదొడ్డి గ్రామంలో వెలుగు చూసింది. హతున్ని టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న రంగస్వామిగా గుర్తించారు. హత్య జరిగిన సుమారు మూడేళ్ల తరువాత మద్దూరు పోలీసులు ఛేదించడం విశేషం.
  
ఏం జరిగిందంటే..  
 చామరాజ నగర జిల్లాలోని కొళ్లేగాల తాలూకాలోని పూజారి బావిదొడ్డి గ్రామానికి చెందిన రంగస్వామి, కొన్ని సంవత్సరాలుగా మద్దూరు తాలుకాలోని తోప్పనహళ్ళి భీమనచెరువు వద్ద  రాళ్ళ క్వారీలో టిప్పర్‌ లారి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో భీమనకెరె గ్రామానికి చెందిన రూపా అనే యువతితో  పెళ్ళి జరిగింది. దాజెనగౌడన దొడ్డి గ్రామంలో నివాసం ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. ముద్దెగౌడ అనే వ్యక్తి కూడా రంగస్వామితో కలిసి టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రూపాతో ముద్దెగౌడకు పరిచయమై అక్రమ సంబంధం వరకు వెళ్ళింది. ఇది రంగస్వామికి తెలిసి భార్యను మందలించాడు. దాంతో ఆగ్రహానికి లోనైన రూపా ఎలాగైన తమ మద్య అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.  (దారుణం: రూ.400 తిరిగి ఇవ్వాలని కోరితే)

నిద్రిస్తుండగా దారుణ హత్య 
2017 జూలై నెల 4వ తేదిన రాత్రి 10 గంటల సమయంలో రూపా, ముద్దెగౌడ కలిసి రంగస్వామి ఇంట్లో పడికొని ఉండటం చూసి కర్రతో కట్టిగా తలపైనకొట్టి  హత్య చేయడం జరిగింది. అనంతరంమృత దేహాన్ని చందహళ్ళి  దొడ్డి చెరువు వద్దకు తీసుకోని వెళ్ళిఅక్కడ మట్టి కోసం తవ్విన గుంతలో పడేసి మళ్ళి మట్టి కప్పి వేయడం జరిగింది. అనంతరం రూపా తన భర్త కనిపించకుండా పోయారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగస్వామి కుటుంబ సభ్యులు అతని కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగస్వామి సోదరి.. రూపా, ఆమె ప్రియునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఖాకీలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది. దాంతో మంగళవారం ఉదయం రూపా, ముద్దెగౌడను తీసుకుని రంగస్వామిని పాత పెట్టిన స్థలానికి వెళ్ళి మృత దేహాన్ని వెలికితీసి శవ పరిక్షలకు పంపించారు.  (పండగ వేళ కిరాతకం..కిటికీలోంచి పెట్రోలు పోసి)

రూపాతో ఏఎస్‌ఐ సంబంధం  
కేసులో మరో మలుపు కూడా ఉంది. రూపా తన భర్తను హత్య చేసిన విషయం బయటకు రాకుండా  ఉండటం కోసం మద్దూరులో ఏఎస్‌ఐ సిద్ధరాజుతో స్నేహం పెంచుకుంది. అతనితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ తతంగం జిల్లా ఎస్పీకి తెలిసి సిద్దరాజు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కేసు లేకుండా చూస్తానని సిద్దరాజు శారీరకంగా వాడుకున్నట్లు బాధితురాలు తెలిపింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top