
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాళాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథరెడ్డి అనే విద్యార్ధి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు. అయితే హాజరు తక్కువ ఉండటంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపం చెందిన ముంజునాథరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.