ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని.. | Husband Tries To Kill The Man For Giving Love Letter To His Wife | Sakshi
Sakshi News home page

ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..

Oct 2 2019 10:02 AM | Updated on Oct 2 2019 10:08 AM

Husband Tries To Kill The Man For Giving Love Letter To His Wife - Sakshi

సాక్షి, వాజేడు: తన భార్యకు ఏడాది క్రితం ప్రేమలేఖ ఇచ్చాడనే కోపంతో కోడిని కోసే కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ప్రగళ్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన హిమామ్‌ చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. కాగా నగేష్‌ హిమామ్‌ భార్యకు ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని లెటర్‌ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హిమామ్‌ దాన్ని మనసులో దాచుకున్నాడు. మంగళవారం నగష్‌ హిమామ్‌ చికెన్‌ సెంటర్‌కు రాగా ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేక హిమామ్‌ కత్తితో నగేష్‌పై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో నగేష్‌ మొఖంపై గాయాలయ్యాయి. వైద్యం చేయించున్న అనంతరం బాధితుడు నేరుగా వాజేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్‌ తెలిపారు. 

గాయపడిన నగేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement