తాగుడుకు బానిసై హోంగార్డు మృతి | Home Guard Died In Medak | Sakshi
Sakshi News home page

తాగుడుకు బానిసై హోంగార్డు మృతి

Aug 9 2018 11:54 AM | Updated on Oct 16 2018 3:15 PM

Home Guard Died In Medak - Sakshi

పాండురంగగౌడ్‌ మృతదేహం 

కల్హేర్‌(నారాయణఖేడ్‌) : ఒ హోంగార్డు కుటుంబ కలహాల కారణంతో కావాల్సిన వారు దురం కాగా విధులకు వెళ్లకుండా తాగుడుకు బానిసై చివరకు ఇంట్లోనే మరణించాడు. వివరాల్లోకి వెళితే కల్హేర్‌ మండలం బీబీపేటకు చెందిన సార పాండురంగగౌడ్‌ కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి స్వగ్రామం బీబీపేటలో స్వంత ఇంట్లో పాండురంగగౌడ్‌ శవమై కనిపించాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన చుట్టుపక్కల వ్యక్తులు ఇంటి తలుపులు తెరిచి చూశారు. పాండురంగా గౌడ్‌ మృతిచెంది ఉన్నాడు.

మృతదేహం కుళ్లిపోవడంతో వాసన వెదజల్లింది. కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ మండలం కోనాపూర్‌లో పుట్టింటిలో ఉంటున్న మృతుడి భార్య కల్పనకు గ్రామస్తులు సమచారం ఇచ్చారు. కల్హేర్‌ ఎస్‌ఐ సాయిరాం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. మృతుడు పాండురంగగౌడ్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాండురంగగౌడ్‌ మృతితో బీబీపేటలో విషాధఛాయలు అలుముకున్నాయి. అతిగా మద్యం తాగడంతో రెండు రోజుల క్రితం మరణించి ఉండోచ్చని ఎస్‌ఐ సాయిరాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement