‘పవిత్ర గ్రంథాలను ఇలా వాడతారా? | A Gurdwara Priest And His Wife Were Arrested For Desecrating Holy Scriptures | Sakshi
Sakshi News home page

‘పవిత్ర గ్రంథాలను ఇలా వాడతారా?

Sep 1 2018 9:34 AM | Updated on Sep 1 2018 11:41 AM

A Gurdwara Priest And His Wife Were Arrested For Desecrating Holy Scriptures - Sakshi

నిజంగా ఇది చాలా అపవిత్రమైన పని

పంజాబ్‌, ఫిరోజ్‌పూర్‌ : పవిత్ర గ్రంథాన్ని అనుచిత పనుల కోసం వాడి.. దాన్ని అపవిత్రం చేశారనే నేపంతో గురుద్వారా పూజారిని, అతని భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివారాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్‌ గురుద్వారాలో పూజారిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి భార్య పవిత్ర గ్రంథంలోని పేజీలను చింపి.. వాటిలో చపాతీలను చుట్టి పిల్లలకు ఇచ్చి పాఠశాలకు పంపింది. ఇది గమనించిన మిగతా విద్యార్ధులు ఈ విషయాన్ని తొలుత సిక్కు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌కి తెలియజేశారు. దాంతో వారు సదరు పూజారి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా వారి వంట గదిలో మరికొన్ని పదార్ధాలను కూడా పవిత్ర గ్రంథంలోని పేపర్లలో చుట్టి పెట్టారు.

ఈ విషయం గురించి యూనియన్‌ అధ్యక్షుడు ‘మేము పవిత్ర గ్రంథాన్నే మా దైవంగా పూజిస్తాం. అలాంటిది ఆ గ్రంథాన్ని చింపడమే కాక ఆ పేజీలను ఇలాంటి పనుల కోసం వినియోగించడం దారుణ. నిజంగా ఇది చాలా అపవిత్రమైన పని. భవిష్యత్తులో మరోకరు ఇలాంటి పనికి పాల్పడకూడదనే ఉద్దేశంతో సదరు పూజారి, అతని భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ’ని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు పూజారిని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement