జెన్‌కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి

సాక్షి, రాజమండ్రి: జెన్‌కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్‌లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి