స్నేహితుడు మాట్లాడటం లేదని... | Friend Commits Suicide In hyderabad | Sakshi
Sakshi News home page

స్నేహితుడు మాట్లాడటం లేదని...

Nov 6 2018 9:19 AM | Updated on Nov 6 2018 8:08 PM

Friend Commits Suicide In hyderabad - Sakshi

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

చాదర్‌ఘాట్‌: స్నేహితుడు మాట్లాడటం లేదని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ప్రవీణ్‌ (21), ఇతడి స్నేహితుడు శివాజీ బోయిన్‌పల్లి లోని కేర్‌ టేకర్‌ సంస్థలో పనిచేసేవాడు.

సోమవారం ఓల్డ్‌ మలక్‌పేట లోని ఓ ఇంటికి కేర్‌ టేకర్‌గా వచ్చిన ప్రవీణ్‌ పని ముగిసిన అనంతరం అదే ఇంట్లోని పై అంతస్తులోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు రెండు రోజులుగా మాట్లాడటం మానివేసినందునే ప్రవీణ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement