బెజ్జింగివాడ అడవుల్లో ఎదురు కాల్పులు

Five Maoists Killed In Encounter In odisha - Sakshi

మల్కాన్‌గిరి: ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.

సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను గుర్తించినట్టు సమాచారం. గాయపడిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో చుట్టపక్కల ప్రాంతాల్లో రక్షణ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top